నీ కవిత ల్లో మాదుర్యం నీ లోని ఔనత్యనికి నిదర్శనం...
నీ మాటల్లో ని తియ్యనిదనం నీ లోని భావాలకు బాహ్య రూపం...
పై రూపాలతో నా మనసు చేరావు నీవు ..
కవిని కానీ నేను నీ ప్రేమతో కవిని గా మారాను నేను...
ప్రతి అక్షరం ప్రేమగా మారి పద్మం గా వికసించవు నా గుండెలో...
అనుక్షణం నీ జ్ఞాపకాలతో నన్ను ప్రేమికుడిని చేసావు...
నిన్ను చేరలేక వచ్చినప్పుడు నా కంట తడి నీకు చెప్ప లేదా నా ప్రేమను...
నీ దురాన్ని తగ్గించి నిన్ను నా దరి చేర్చమని హ జాబిలి అందిచాలేదా సందేశం..
నీ పై వున్నా ప్రేమను ఈ చిరుగాలితో గుస గుసలాడను నీ శ్వాసలో చేరలేదా..
సూర్య కిరణాలతో చెప్పాను ఎ రోజు నిన్ను తలచకుండా ఉండనని నీకు చేరవేయలేదా..
ఒక్క క్షణం నా గురించి ఆలోచించు నేస్తం వెయ్యి జన్మాలు నీ కోసం ఎదురు చూస్తుంటాను..



