Love YoU FoReVeR

Love YoU FoReVeR
నీ కై ఎదురుచూపులు

12 Apr 2012

ప్రేమ సంఘర్షణ

ఎలా తెలపను నేస్తమా ..నాలోని ప్రేమ సంఘర్షణను..

నీ కవిత ల్లో మాదుర్యం నీ లోని  ఔనత్యనికి నిదర్శనం...
నీ మాటల్లో ని తియ్యనిదనం నీ లోని భావాలకు బాహ్య రూపం...
పై రూపాలతో నా మనసు చేరావు నీవు ..  
కవిని కానీ నేను నీ ప్రేమతో కవిని గా మారాను నేను... 
ప్రతి అక్షరం ప్రేమగా మారి పద్మం గా వికసించవు నా గుండెలో...
అనుక్షణం నీ జ్ఞాపకాలతో నన్ను ప్రేమికుడిని చేసావు...

నిన్ను చేరలేక వచ్చినప్పుడు నా కంట తడి నీకు చెప్ప లేదా నా ప్రేమను... 
నీ దురాన్ని తగ్గించి నిన్ను నా దరి చేర్చమని హ జాబిలి అందిచాలేదా సందేశం.. 
నీ పై వున్నా ప్రేమను ఈ చిరుగాలితో గుస గుసలాడను నీ శ్వాసలో చేరలేదా..  
సూర్య కిరణాలతో చెప్పాను ఎ రోజు నిన్ను తలచకుండా ఉండనని నీకు చేరవేయలేదా.. 
ఒక్క క్షణం నా గురించి ఆలోచించు నేస్తం వెయ్యి జన్మాలు నీ కోసం ఎదురు చూస్తుంటాను..
 
 

10 Apr 2012

నా ప్రయాణం...


మేగం ప్రయాణం చినుకై కురిసే వరుకు...
చినుకు ప్రయాణం ధరిణి చేరే వరుకు....
అలల ప్రయాణం తీరం చేరే వరకు....
నావ ప్రయాణం వడ్డుకు చేరే వరుకు...
మెరుపు ప్రయాణం వెలుగై మెరిసే వరుకు...
చూపు ప్రయాణం కనులు కలిసే వరుకు...
నా ప్రయాణం నిన్ను చేరే వరుకు...   

4 Apr 2012

తోలి అక్షరం

ఈ నా తోలి అక్షరం ఆమె నేర్పిందే , ఇక నా ప్రతి అక్షరం ఆమె కోసమే....

నా కవితల్లో భావం ఆమె రూపమే , ఇక నా ప్రతి పేరన ఆమె స్నేహానికే.....

తోలి ప్రయత్నం ఆమె మెప్పుకే , ఇక నా ప్రతి ఆలోచన ఆమె ప్రేమకే.....

నా ఎదురు చూపు ఆమె స్పందనకే, ఇక నా ప్రతి  కవితల్లో ఆమె సర్డుబాట్లకై నా అంకితం..

బందినైతేనే...

ఓ బంగారమా! 

నా పై అలకను వీడి నా గుండెల పై  నిదురపో  నేస్తమా...

నేనున్నాని బరోస చాలు సుమా నా ప్రాణం నీకు అర్పిస్తాను ప్రియతమా...

మౌనంగా నీవు చూసే చూపులు చాలు సుకుమారమా నీ వడిలో బందినైతను నా ప్రాణమా...

నీవు లేఖ నేను చేర సాల చేరితినే నీ  నవ్వుతో నన్ను విముక్తి చెయ్యవే ప్రణయమా...

సర్వం నీకై అర్పిస్తానే నన్ను కాదనకే నా ప్రణయ  పద్మర్పితమా ....





23 Dec 2011

ఏమని చెప్పను ...

మనసు ను  మాట గా  చేసి ముగాబోయన  నా ప్రేమను చెప్పను నీకు...
నా మనసును ఖైది గా చేసి కనమరుగై  పోయావు...
దూరంగా ఉన్నవని తెలిసిన నీకై తపించి పోయి నా ప్రేను ను చెప్పాను నీకు...
నా దురాన్ని దరిచేరనియ్యక నా మనస్సు ను  నెట్టి వేసావు... 
కాలమైన నా వేదనను  నీకు చెపుతుందని మిక్కిలి సంతోషించాను....



మనిసి గాయ పడితే  మాన్ప వచ్చు మనసు గాయపడితే ????
 నీ కోపం తో  కాలాన్ని సైతం మార్చి వేసావు.. నా సంతోషం బూడిద చేసావు...  


అయిన నేను నిన్ను ప్రేమిస్తూ నా మనస్సు నీకు అర్పిస్తాను...





22 Dec 2011

నేస్తమా...

                                                                                                                                                                            
 నాకు నీవై నీకు నేనై 

నా చెలియా రూపం నే కాన లేదే అయితేనేమి నా కళ్ళలో ఆమె రూపం దాగి ఉన్నది ... 


               నా చెలియా హృదయం నే చేర లేదే అయితేనేమి నా హృదయ ఆమె కోసం తపిస్తున్నది....   

               నా చెలియా ఒడిలో నే  పవలించాలేదే అయితే నేమి నా గుండెల పై ఆమె నిదిరిస్తున్నది....

              నా చెలియా ప్రేమను నే పొందలేదే అయితే నేమి నా ప్రేమ ఆమె కోసం ఎదురుచూస్తున్నది.. 

21 Dec 2011

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ నేవే నేనని తలచి వ్రాసానే  ఈ ప్రేమ లేఖ..

కాదని నీవు నా  ప్రేమ లేఖను చించేవే అది నా మనసు అని నీకు చెప్పెనే...

ఇదే నా మొదటి ప్రేమ లేఖ నేవే నేనని తలచి వ్రాసానే  ఈ ప్రేమ లేఖ..

కాదని నీవు నా  ప్రేమ లేఖను చించేవే అది నా జీవితం  అని నీకు చెప్పెనే...

ఇదే నా మొదటి ప్రేమ లేఖ నేవే నేనని తలచి వ్రాసానే  ఈ ప్రేమ లేఖ..

కాదని నీవు నా  ప్రేమ లేఖను చించేవే అది నా ప్రాణం  అని నీకు చెప్పెనే...